కొరటాల తదుపరి సినిమా మహేశ్ బాబుతోనే?

  • చిరూ కోసం కథ రెడీ చేసిన కొరటాల 
  • 'సైరా' విషయంలో మరింత ఆలస్యం 
  • 'మహర్షి' తరువాత కథ సెట్ కాలేదు      
'సైరా' తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చిరంజీవి భావించారు. అందుకోసం కొరటాల గట్టిగానే కసరత్తు చేసి మంచి కథను సిద్ధం చేసుకున్నారు. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేసి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలని అనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలను కూడా మొదలుపెట్టారు. అయితే కొన్ని కారణాల వలన, 'సైరా' విషయంలో అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యమవుతోందట. ఈ కారణంగా కొరటాల ప్రాజెక్టు మార్చిలో కూడా పట్టాలెక్కకపోవచ్చని సమాచారం.

అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఇష్టంలేని కొరటాల, మహేశ్ బాబుతోనే మరో సినిమా చేసే ఉద్దేశంతో వున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా రాజమౌళి ప్రాజెక్టుతో బిజీగా వున్నారు. బన్నీయేమో త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. 'మహర్షి' తరువాత సుకుమార్ తో చేయాలని మహేశ్ అనుకున్నప్పటికీ కథ ఇంకా సెట్ కాలేదు. అందువలన మహేశ్ తోనే కొరటాల సినిమా వుండొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'శ్రీమంతుడు'.. 'భరత్ అనే నేను' అనే బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.     
Go Back to Shorts
chiranjeevi
koratala

More Telugu News